: చిదంబరం బడ్జెట్ ముఖ్యాంశాలు


ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు.
* ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడిన దేశాలలో భారత్ ఒకటి. సమగ్ర ఆర్థిక అభివృద్దే తమ లక్ష్యం. భారత ఆర్థిక మూలాలు ఇంకా పటిష్ఠంగానే ఉన్నాయని చెప్పారు.
* 2014-15 ఏడాదికి ప్రణాళిక వ్యయం రూ. 5,55,322 కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ. 12,07,892 కోట్లు. ద్రవ్యలోటు 4.6 శాతం. సబ్సిడీలు రూ. 2.65 లక్షల కోట్లు.
* జనవరి చివరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి పరిమితం చేశాం.
* ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్ బీఐ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారింది.
* 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 255 మిలియన్ టన్నులు.
* వస్తు ఉత్పత్తుల దిగుమతి 326 బిలియన్లకు పెరిగే అవకాశం.
* 2.44 లక్షల మెగా వాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.
* ఎగుమతులు బాగా పుంజుకున్నాయి.
* జనవరిలో 6.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం.
* ఉత్పత్తి రంగం ఇంకా వెనుకబడే ఉంది.
* నాలుగు ఆల్ట్రా పవర్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాలు.
* రుపాయి బలహీనతను నిలువరించగలిగాం.
* 2013-14 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 4.90 శాతం.
* 2013-14లో 7లక్షల 35 వేల కోట్ల వ్యవసాయ రుణాలు.
* చెన్నై-బెంగళూరు, బెంగళూరు-ముంబై, ముంబై-అమృత్ సర్ క్యారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి.
* 8 జాతీయ ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు.
* టెలికాం, ఏవియేషన్, ఫార్మా కంపెనీలకు మంచి జరిగింది.
* కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు రూ. 100 కోట్లు కేటాయింపు.
* 45 బిలియన్ డాలర్లు కరెంటు ఖాతా లోటు.
* రూ. 1000 కోట్లతో నిర్భయ నిధి.
* హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు రూ. 1200 కోట్ల అదనపు నిధులు.
* గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా 3,89,578 కి.మీ. రహదారుల నిర్మాణం.
* సైన్యంలో ఒకే ర్యాంకు, ఒకే పింఛను.
* జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకానికి రూ. 1000 కోట్లు.
* హౌసింగ్ కు రూ. 6000 కోట్లు.
* తాగునీటి పథకానికి రూ. 15,600 కోట్లు.
* మహిళా శిశు సంక్షేమానికి రూ. 21 వేల కోట్లు.
* పంచాయతీ రాజ్ కు రూ. 7 వేల కోట్లు.
* రైల్వేలకు రూ. 29 వేల కోట్లు.
* ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 48,638 కోట్లు.
* ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 36,760 కోట్లు.
* మైనార్టీల సంక్షేమానికి రూ. 2,11,451 కోట్లు.
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 11,200 కోట్లు.
* ఇస్రోకు అదనపు సాయం.
* 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెట్టాం.
* డెఫెన్స్ పెన్షన్లకు రూ. 500 కోట్లు.
* డ్వాక్రా సంఘాలకు రూ. 41 వేల కోట్లు.
* సాయాజిక న్యాయం, సాధికారతకు రూ. 6,730 కోట్లు.
* రక్షణ రంగానికి రూ. 2.24 లక్షల కోట్లు.
* మొబైల్ హ్యాండ్ సెట్లపై సుంకం తగ్గింపు. జూన్ వరకు అన్ని రకాల వస్తువులపై 2 శాతం సుంకం తగ్గింపు.
* పన్ను ఎగవేతదారులపై దర్యాప్తులు ముమ్మరం.
* వైద్య రంగానికి రూ. 36,300 కోట్లు.
* మానవ వనరుల అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు.
* ఉన్నత విద్యకు రూ. 79,459 కోట్లు.
* వ్వవసాయ రుణాల లక్ష్యం రూ. 7.35 లక్షల కోట్లు.
* జాతీయ సోలార్ మిషన్ కింద 2వేల మెగావాట్ల ప్రాజెక్టులు.
* ట్యాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు.
* చిన్న కార్లపై ఎక్సైజ్ సుంచం 4 శాతం తగ్గింపు. 5 లక్షల విలువైన కారు. రూ. 20 వేలు తగ్గే అవకాశం.

  • Loading...

More Telugu News