: లోక్ సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఆందోళన
ఇంతవరకు జరగని సంఘటనలు ఈ రోజు లోక్ సభలో చోటు చేసుకున్నాయి. సీమాంధ్ర ఎంపీలు సభ నుంచి సస్పెండ్ అయన నేపథ్యంలో, వారి బాధ్యతను సీమాంధ్ర కేంద్ర మంత్రులు తీసుకున్నారు. తొలిసారిగా సభలో కావూరి, చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల, పళ్లంరాజులు నిరసన తెలుపుతున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వీరికి తోడు, ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ లు జైసమైక్యాంధ్ర అంటూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. వీరందరినీ సముదాయించడానికి స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నిస్తున్నారు.