: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు లోక్ సభ ఆమోదం
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి చిదంబరం సభలో ప్రకటించారు. మూడు రోజుల కిందట అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి పాలనను కోరుతూ నివేదిక పంపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొన్ననే (శనివారం) రాష్ట్రపతి ఆంగీకారం తెలిపారు.