: ఉద్యమ బాటలో పయనిస్తూ ఢిల్లీలో నేలకొరిగిన నెల్లూరు జిల్లా ఏపీఎన్జీవో నేత
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరుగుతోన్న ఏపీఎన్జీవో సభలో విషాదం చోటు చేసుకుంది. సమైక్యాంధ్ర కోరుతూ ఢిల్లీలో ఇవాళ, రేపు ఏపీఎన్జీవోలు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ఈ ఆందోళన కార్యక్రమంలో హస్తినలో వేలాది మంది ఎన్జీవోలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఏపీఎన్జీవో ఉపాధ్యక్షుడు దామోదర్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న నేత గుండెపోటుతో నేలకొరిగారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఏపీఎన్జీవో సభలో విషాద ఛాయలు అలముకొన్నాయి.