: ఢిల్లీకి బయల్దేరిన బీజేపీ తెలంగాణ నేతలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతాపార్టీ నేతలు ఆదివారం నాడు హైదరాబాదులో సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీపైన, అలాగే సొంత పార్టీ జాతీయ నాయకత్వంపైన ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు నిన్నటి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే తెలంగాణ నాయకులు హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అక్కడ బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలసి బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.