: సమైక్యం కోసం చంద్రబాబు బీజేపీలో చిచ్చుపెడుతున్నారు: గండ్ర


దేశంలోనే అత్యంత దారుణమైన నేత చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, చంద్రబాబు బీజేపీలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. గతంలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు... ఇప్పుడు రాష్ట్రం ఏర్పడబోయే ముందు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలసి విభజనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా, విజయవాడ ఎంపీ లగడపాటికి మతి భ్రమించిందని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో గండ్ర మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News