: క్రీడాకారిణిపై శిక్షకుడే కన్నేశాడు
క్రీడలో మెళకువలు నేర్పి దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా మలచాల్సిన ఒక శిక్షకుడు కామమైకంలో విలువలు వదిలేశాడు. ముంబైలోని కాండివాలిలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో కోచ్ గా పనిచేస్తున్న కేబీ సింగ్ ఒక క్రీడాకారిణిని లైంగికంగా వేధించుకుతింటున్నాడు. దీంతో బాధితురాలు సమతానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేబీ సింగ్ ను అరెస్ట్ చేశారు. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.