: నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ చేత ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పలువురు న్యాయ వాదులు పాల్గొననున్నారు. జస్టిస్ రమణ ఈ నెల 13 నే ప్రమాణం చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్యకారణాల వల్ల అది ఈ రోజుకు వాయిదా పడింది. సుప్రీంకోర్టు న్యాయముర్తులుగా పిన్న వయసులో నియమితులైన వారిలో జస్టిస్ రమణ ఈ దశాబ్దంలోనే తొలి వ్యక్తి. ఆయన ఆగస్టు 26, 2022 వరకు సుప్రీంకోర్టులో కొనసాగుతారు. సీనియార్టీ ప్రకారం 2021, ఏప్రిల్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్ రమణ 1957 ఆగస్టు 27న నూతలపాటి గణపతిరావు, సరోజినీ దంపతులకు కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు.