: శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో అత్యాచారయత్నం
అత్యంత పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయం దగ్గర దారుణం జరిగింది. రాహుకేతువుల పూజకోసం వచ్చిన ఓ యువతిని కామాంధులు కాటేయబోయారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నై నుంచి ఓ యువతి తన తల్లిదండ్రులతో కలసి శ్రీకాళహస్తి వచ్చింది. పూజ కోసం పూజాసామాగ్రి కొనడానికి వెళ్లిన ఆమెను, ముగ్గురు దుకాణదారులు మాటల్లో పెట్టి, సామూహిక అత్యాచారం చేయబోయారు. ప్రతిఘటించిన ఆమె, వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు దీనిపై స్పందించలేదు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ఆమె తిరిగి చెన్నై వెళ్లిపోయింది. విషయం తెలిసిన ప్రజలు, భక్తులు జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.