: కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది దుర్మరణం
కాశ్మీర్లో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ-శ్రీనగర్ రహదారిపై ఓ మినీ బస్సు లోయలో పడి 10 మంది మృత్యువాత పడ్డారు. 40 మందికి గాయాలయ్యాయి. బస్సు బనిహాల్ నుంచి రాంబన్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని జమ్మూలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు.