: డీఎంకే మంత్రుల రాజీనామాలు ఆమోదం


ఐదుగురు డీఎంకే మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రుల యూనియన్ కౌన్సిల్లో సభ్యులైన డీఎంకే మంత్రుల రాజీనామాలను అంగీకరించాము' అని ఇందులో తెలిపారు. శ్రీలంక వ్యవహారం నేపథ్యంలో గుర్రుగా ఉన్న డీఎంకే యూపీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో
కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి ఎమ్ కే అళగిరి.. ఆర్ధిక వ్యవహారాల మంత్రి ఎస్ఎస్ పలనిమనిక్కమ్.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ గాంధీసెల్వన్.. వాణిజ్య,పరిశ్రమల సహాయ మంత్రి ఎస్. జగత్రక్షకణ్.. సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డి. నెపోలియన్ లు నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజీనామాలు సమర్పించారు.

  • Loading...

More Telugu News