: మన్మోహన్ పై అద్వానీ వ్యాఖ్యలు
స్వచ్ఛమైన నడవడికతో ప్రధాని పదవి చేపట్టిన మన్మోహన్ సింగ్ .. పదవీకాలం ముగిసేనాటికి అవినీతి మకిలి అంటించుకున్నారని బీజేపీ సీనియర్ నేత అద్వానీ విమర్శించారు. అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ అప్రదిష్ఠ మూటగట్టుకున్నారని ఆరోపించారు. ప్రధాని కాకముందు మన్మోహన్ సింగ్ .. పీవీ హయాంలో ఆర్ధిక మంత్రిగా ఎనలేని సేవలు అందించారని చెప్పారు. కామన్వెల్త్ క్రీడలు, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కేటాయింపులు.. ఇలా భారీ కుంభకోణాలతో మన్మోహన్ ప్రతిష్ఠ మసకబారిందని అద్వానీ వివరించారు. తన బ్లాగులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.