: నేపాల్లో విమానం అదృశ్యం
నేపాల్లో ఓ తేలికపాటి విమానం ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 18 మంది ప్రయాణికులున్నారు. నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం పోఖారా విమానాశ్రయం నుంచి ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకు గాల్లోకెగిరింది. మరో 15 నిమిషాల తర్వాత అది రాడార్లకు అందకుండా పోయింది. విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సంకేతాలు నిలిచిపోయాయి. ఈ విమానం ఓ ప్రముఖ రిసార్ట్ నుంచి పర్యాటకులను పశ్చిమ నేపాల్లోని ఓ పట్టణానికి తీసుకువెళుతోంది.