: హ్యాకింగ్ కు గురైన 'ఫోర్బ్స్'
విఖ్యాత బిజినెస్ మాగజైన్ ఫోర్బ్స్ కు చెందిన అఫిషియల్ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. సిరియా ఎలక్ట్రానిక్ ఆర్మీగా పేరొందిన అసాద్ హ్యాకర్స్ గ్రూప్ ఈ వెబ్ సైట్ పై దాడి చేసింది. పది లక్షల మందికి పైగా యూజర్ల వివరాలు తస్కరణకు గురైనట్టు ఫోర్బ్స్ తెలిపింది. ఆయా ఖాతాల పాస్ వర్డ్ లు అన్నీ దుర్భేద్యమని పేర్కొంది. అయినా జాగ్రత్త కోసం యూజర్లు తమ పాస్ వర్డ్ లను మరోసారి మార్చుకోవాలని సూచించింది. కాగా, హ్యాకింగ్ పై స్పందించిన అసాద్ గ్రూప్ సభ్యులు.. తాము ఫోర్బ్స్ సోషల్ మీడియా మేనేజర్ ఆధారంగా వెబ్ సైట్ యాక్సెస్ పొందామని ట్విట్టర్లో వెల్లడించారు.