: మోడీ 'లోకల్ టచ్'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు హిమాచల్ ప్రదేశ్ లోని సుజన్ పూర్ లో జరిగిన పరివర్తన్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేషధారణ హిమాచల్ ప్రదేశ్ స్థానికతను ప్రతిబింబించింది. తలపై టోపీ, మెడలో ఉన్ని మఫ్లర్, భుజంపై కమలం ముద్రించి ఉన్న కాషాయ శాలువాతో సభికులను ఆకట్టుకునేందుకు యత్నించారు. అంతేగాకుండా, స్థానిక అంశాలను, సమస్యలను ప్రస్తావించి హిమాచల్ వాసుల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పంట అయిన యాపిల్ కు మద్దతు ధర ఇవ్వాలని, అక్కడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసి తాను వ్యవసాయానికీ పెద్దపీట వేస్తానని వివరించగలిగారు.