: మహిళల సాధికారతపై దృష్టి పెట్టిన రాహుల్


కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ కర్ణాటకలో నేడు ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తుముకూరులో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత ఆవశ్యకతను వివరించారు. ఎన్నికల ప్రక్రియలోకి ఎక్కువమంది మహిళలు వచ్చేలా ప్రోత్సహించడం తమ లక్ష్యమని వివరించారు. మహిళా సాధికారత సాధించిన రాష్ట్రాలు పురోభివృద్ధి పరంగానూ ముందువరుసలో నిలిచాయని చెప్పారు. మహిళా చైతన్యం దేశాన్ని కూడా అభ్యున్నతి దిశగా నడిపిస్తుందని పేర్కొన్నారు. మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని చెప్పారు. రాజకీయాల్లో పురుషులకు సమానంగా మహిళలకూ అవకాశాలు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News