: టాటాల పేరుతో విదేశీ కంపెనీ టోపీ


టాటా ఆగ్రో హోల్డింగ్ లిమిటెడ్.. ఇదేదో టాటా గ్రూపు కంపెనీ అని పొరబడేరు? కానే కాదు. బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కు చెందిన మోసగాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత కలిగిన టాటా గ్రూపులో భాగమని చెబుతూ ఎంతో మందికి టోపీ పెడుతున్నారు. అత్యధిక వడ్డీ ఆశచూపుతూ ఆన్ లైన్లో పెట్టుబడులను దండుకుంటున్నారు. ఈ మోసపూరిత కంపెనీ రోజుకు 2 నుంచి 3 శాతం రాబడి ఇవ్వజూపుతోంది. అంటే 50 రోజుల్లోనే పెట్టుబడి మొత్తానికి సరిపడా రాబడి అన్నమాట.

ఈ విషయం టాటా గ్రూప్ యాజమాన్య కంపెనీ అయిన టాటాసన్స్ దృష్టికి వచ్చింది. దీనిపై టాటాసన్స్ తీవ్రంగా స్పందించింది. ఆ కంపెనీతో తమకెటువంటి సంబంధం లేదని ప్రకటించింది. సదరు మోసపూరిత సంస్థ టాటా పేరును వాడకంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News