: ముషారఫ్ అరెస్టుపై పాక్ అభ్యర్ధన తిరస్కరణ
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరెస్టుపై పాకిస్థాన్ చేసిన అభ్యర్ధనను ఇంటర్ పోల్ నిరాకరించింది. బెనజీర్ భుట్టో హత్య కేసులో విచారణకు సహకరించడం లేదని తెలుపుతూ.. ఈ వ్యవహారంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ సహాయాన్ని పాక్ కోరింది.
2009 నుంచి ముషారఫ్ దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్నారు. త్వరలో జరగనున్న పాక్ ఎన్నికలకోసం తన పార్టీ 'ఆల్ పాకిస్థాన్ ముస్లింలీగ్' ను సిద్ధం చేసేందుకు ఈ నెల 24న స్వదేశానికి తిరిగి రాబోతున్నట్లు గత నెలలో ఆయన ప్రకటించారు. ఎఫ్ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చేసిన విన్నపాన్ని ఇంటర్ పోల్ తిరస్కరించడం ఇది రెండోసారి.