: 'తిరుమల' ఉన్మాది కుమార్ పరారీ
తిరుమల కాలిబాటలో నిన్న దంపతులను గాయపర్చిన సైకో కుమార్ నేడు పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు. కాలిబాటలో తిరుమల కొండపైకి వెళుతున్న దంపతులపైకి సమీపంలోని పొదల మాటు నుంచి వచ్చి కర్ర, రాళ్ళతో దాడి చేసిన కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడిని విచారణ నిమిత్తం కడప పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకువచ్చారు. అక్కడ అతను పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు నిర్వహిస్తున్నారు.