: కాంగ్రెస్ పార్టీపై సుజనా విమర్శనాస్త్రాలు
టీడీపీ నేత సుజనా చౌదరి నేడు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనతో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన ఆధారంగా మరో 10 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికలకు వెళుతుందని వివరించారు. విభజన అంశం కాంగ్రెస్ మానిఫెస్టోలో ప్రధాన అంశం కానుందని సుజనా దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల సూచనలను కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలను ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆయన సూచించారు.