: ఎంపీల తీరుపై దత్తన్న ఆవేదన
లోక్ సభలో కాంగ్రెస్, టీడీపీ సభ్యుల తీరుపై బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి వ్యవహరించిన తీరును దేశం యావత్తూ ఖండిస్తుంటే, కొందరు సమర్థిస్తుండడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అందుకు సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు కాంగ్రెస్ కుట్రలో భాగమేనని దత్తన్న దుయ్యబట్టారు.