: సాయంత్రం నాలుగింటికి సీమాంధ్ర నేతలతో సీఎం కిరణ్ భేటీ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం నాలుగింటికి సీమాంధ్ర నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. భవిష్య కార్యాచరణపై వారితో చర్చిస్తారు. కాగా, సీఎం కిరణ్ ను క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం పలువురు నేతలు కలిశారు. కేంద్ర మంత్రులు కోట్ల, పళ్ళంరాజు, రాష్ట్ర మంత్రి పితాని, వీరశివారెడ్డి, టీడీపీ నేత పయ్యావుల తదితరులు కిరణ్ తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు.