: ఫేస్ బుక్ తో ఓ పెయింటర్ వేల కోట్లకు అధిపతయ్యాడు
అమెరికాకు చెందిన డేవిడ్ చో (37) అందరిలాంటి పెయింటరే. కాకపోతే గోడలపై చక్కటి చిత్రాలను కూడా వేయగల నైపుణ్యంగలవాడు. ఒకే ఒక్క అవకాశం అతడిని 1,240 కోట్ల రూపాయలకు యజమానిని చేసింది. ఫేస్ బుక్ ఏర్పాటైన కొత్తలో డేవిడ్ సిలికినాన్ వ్యాలీలోని ఆఫీసులో పెయింట్ వేశాడు. మార్క్ జుకెర్ బర్గ్ తమ వద్ద డబ్బుల్లేకపోవడంతో కంపెనీలో డేవిడ్ కు కొంత వాటా ఇచ్చారు. మరోసారి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. దాంతో వాటా పెరిగిపోయింది. అయితే, డేవిడ్ ఇంతవరకు వాటిని అమ్ముకోలేదు. ఇప్పడు అతడివద్దున్న షేర్ల విలువ 20 కోట్ల డాలర్లు (1240కోట్ల రూపాయలు). అదీ అదృష్టం పట్టుకోవడమంటే!