: ఆదాయపన్ను చెల్లింపుదారుకు బీజేపీ బంపర్ బొనాంజా!


ఎగువ మధ్యతరగతికి చెందిన ఆదాయపన్ను చెల్లింపుదారులను పరమ సంతోషానికి గురిచేసే కబురు ఒకటి బీజేపీ చెప్పింది. ఉద్యోగులపై ఆదాయపన్ను పూర్తిగా ఎత్తివేయడం లేదా వారు ఎంత దాచుకున్నా సరే.. ఆ మొత్తంపై రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయాలని బీజేపీ విజన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని జాతీయ నేత సుబ్రమణ్యస్వామి చెప్పారు. ఆదాయపన్ను కారణంగా సంపాదించిన దాన్ని నల్లధనం రూపంలో విదేశాల్లో దాచుకుంటున్నారని స్వామి చెప్పారు. ఈ నేపథ్యంలో నెలకు లక్ష రూపాయలకుపైగా ఆదాయం ఉన్నవారి నుంచే పన్ను వసూలు చేయాలని, అలాగే పొదుపు చేసిన మొత్తాన్ని కూడా పన్ను పరిధి నుంచి మినహాయింపు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పొదుపు పెరుగుతుందని, అది దేశ జీడీపీ పెరగడానికి తోడ్పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News