: రాహుల్ కంట్లో పడ్డ నాలుగేళ్ల బుడతడు


బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ మైదానంలో శనివారం విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ముగిసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భద్రతతో కూడిన వాహన శ్రేణితో బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లాక ఓ నాలుగేళ్ల బుడతడు పేరు దుష్యంత్.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ ఫ్లాగ్ చేత్తో పట్టుకుని ఊపుతూ రాహుల్ కు కనిపించాడు. అంతే... రాహుల్ వెంటనే తన వాహనాన్ని ఆపమని డ్రైవర్ ను ఆదేశించారు. సెక్యూరిటీ వలయాన్ని పక్కన పెట్టి రోడ్డు పక్కన తండ్రితో కలిసి నించున్న దుష్యంత్ వద్దకు వచ్చారు. ఎలా ఉన్నావు? అని అడగగా.. బావున్నానని దుష్యంత్ బదులిచ్చాడు. అంతేకాదు, 'మీరు ప్రధానమంత్రి అవుతారు' అంటూ రాహుల్ లో జోష్ నింపాడు. 'నువ్వు కూడా కాగలవు' అంటూ రాహుల్ ప్రోత్ర్సాహాన్నిచ్చారు. రాహుల్ కోసం మూడు గంటలుగా వేచి ఉన్నామని దుష్యంత్ తండ్రి మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News