: రిషి ప్రభాకర్ గురూజీ కన్నుమూత


సిద్ద సమాధియోగ వ్యవస్థాపకులు రిషి ప్రభాకర్ గురూజీ ఈ రోజు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గురూజీ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆశ్రమవాసులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సిద్ధ సమాధియోగ ఆశ్రమాలు ఉండగా, ప్రధాన ఆశ్రమం బెంగళూరు శివారులోని మరళవాడిలో ఉంది. మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో సిద్ధ సమాధియోగ ఆశ్రమం ఉంది.

  • Loading...

More Telugu News