: నందిగామ వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా...30 మందికి గాయాలు
కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొనడంతో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా జమలాపురంలోని వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులంతా సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్ సమీపంలోని కార్ఖానా ప్రాంతానికి చెందినవారుగా సమాచారం. నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నందిగామ మండలం మునగచర్ల అడ్డరోడ్డువద్ద ఈ ఘటన జరిగింది.