: తెలంగాణపై బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: కేంద్ర మంత్రి బలరాం నాయక్
తెలంగాణకు కట్టుబడి ఉంటామంటూ భారతీయ జనతాపార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదిలేయాలని ఆయన చెప్పారు. టీ-టీడీపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన సూచించారు. సీమాంధ్రులు భద్రాచలం డివిజన్ ను అడగవద్దని, ముంపు గ్రామాలనే కోరాలని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.