: రాహుల్ గాంధీ ఆగ్రహంతో బిల్లు చించినప్పుడు.. ఏం చేశారు?: ఉమ్మారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహంతో బిల్లు ప్రతులను చించివేసి, రాష్ట్రపతిని అవమానపరిస్తే ఏం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ను విమర్శించడం నీచ రాజకీయమని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో కాంగ్రెస్ చేతిలో పావుగా మారారని ఉమ్మారెడ్డి విమర్శించారు.