: ప్రతి బ్రాంచిలోనూ బ్యాంకులు ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందే: కేంద్రం


బ్యాంకులు తమ ప్రతి బ్రాంచీలోనూ ఏటీఎంను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర మంత్రి నమో నారాయణ్ మీనా స్పష్టం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి ఏటీఎంలు నెలకొల్పాలని చెప్పారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో దేనా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొత్తగా ప్రారంభమవుతున్న బ్యాంకులన్నీ ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏటీఎం మెషీన్ల కొరత ఉందని మంత్రి అంగీకరించారు. కాలేజీలు, యూనివర్శిటీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద కూడా ఏటీఎంలు నెలకొల్పాలని బ్యాంకులకు సూచించారు.

  • Loading...

More Telugu News