: కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎక్కువయ్యాయి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కరెంట్ కోతలు తగ్గించామని, రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో హైదరాబాదు నగరంలో కరెంట్ కోతలను పూర్తిగా ఎత్తివేశామని ఆయన గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆయన అన్నారు. గ్రామాల్లో 6 గంటలు, పట్టణాల్లో 4 గంటలు, నగరాల్లో 2 గంటలు కరెంట్ కోతలు విధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పాడిపంటలకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేసి.. అన్నదాతలను ఆదుకుంటామని ఆయన ప్రకటించారు.