: విభజనకు మొదట అంగీకారం తెలిపింది బీజేపీనే: జేడీ శీలం


కేంద్ర మంత్రి జేడీ శీలం నేడు ఢిల్లీ వెళుతూ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల నేతలు తొలుత విభజనకు సమ్మతించి, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజనకు మొదట అంగీకారం తెలిపింది బీజేపీయే అని మంత్రి వెల్లడించారు. కాగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మధ్యేమార్గంగా కొన్ని ప్రతిపాదనలు చేశారని చెప్పారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని, హైదరాబాద్ పై పాలనాధికారం కేవలం గవర్నర్ కే అప్పగించకుండా, నలుగురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలతో ఓ మండలి ఏర్పాటు చేసి అధికారాన్ని పంచాలన్నది ఆ ప్రతిపాదనల సారాంశమని వివరించారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని, సీమ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. కొందరు రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్ వల్లే మేలు జరిగిందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News