: మళ్ళీ తెరపైకి వచ్చిన బైరెడ్డి
ఇటీవల కాలంలో కాస్తంత సద్దుమణగిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో లోక్ సభలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు ఇక చాలించాలని సీమ నాయకులకు సూచించారు. సీమాంధ్రకు రాజధానిని సీమలోనే ఏర్పాటు చేసేందుకు వారు కృషి చేయాలని సూచించారు.