: బీజేపీకి రాహుల్ సూటి ప్రశ్నలు


బీజేపీపై కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని బెల్గాంలో ఓ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ, అవినీతిపై మాట్లాడుతున్న బీజేపీ.. తాము అధికారం వెలగబెట్టిన రాష్ట్రాల్లో పరిస్థితిని ఓసారి గమనించాలని హితవు పలికాడు. అవినీతిపై పోరంటూ దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టిన వారి నాయకుడు (మోడీ) ఓ విషయం తెలుసుకోవాలన్నారు. కర్ణాటకలో అప్పటి సీఎం యడ్యూరప్ప సహా పలువురు బీజేపీ నేతలు అవినీతిలో కూరుకుపోలేదా? అవన్నీ ఆయన (మోడీ)కు కనబడలేదా? అని ప్రశ్నించారు. అప్పట్లో కర్ణాటక రాజకీయాలన్నీ బళ్ళారి చుట్టూనే పరిభ్రమించాయని విమర్శించారు. అంతేగాకుండా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొందని, అయినా, ఆయన (మోడీ)కు కనబడడంలేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ గుజరాత్ లో అవినీతి చోటు చేసుకున్నా పట్టించుకోబోరని రాహుల్ సెటైర్ వేశారు.

  • Loading...

More Telugu News