: రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఈ రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రివాల్ రాజీనామా చేయడంతో ఏర్పడిన పరిస్థితులు, తదితర వివరాలతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, తెలంగాణ బిల్లుపై లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహంపైనా వారు మాట్లాడుకోనున్నట్లు సమాచారం.