: కేరళ కోజికోడ్ లో తెలుగు విద్యార్థి మృతి
కేరళ కోజికోడ్ లో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. 19 ఏళ్ల మన్నం వెంకటేశ్వర్లు అనే విద్యార్థి నిట్ కళాశాలలో గోడ కూలి మీద పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామానికి చెందిన వాడని కళాశాల యాజమాన్యం తెలిపింది. నిట్ లో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు షటిల్ ఆట ఆడుతుండగా.. ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడింది. ఘటన జరిగిన వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం అతడు తుదిశ్వాస విడిచాడు.