: లగడపాటి పెప్పర్ స్ప్రేపై వర్మ ట్వీట్లు
పార్లమెంటులో టీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం నిండు సభలో పెప్పర్ స్ప్రే ఉపయోగించి ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ప్రశంసలు కురిపించాడు.
ఈ మేరకు 'భగత్ సింగ్ తర్వాత పార్లమెంటును షాక్ కు గురి చేసింది రాజగోపాల్ మాత్రమే. భగత్ సింగ్ భారత్ కోసం.. రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ కోసం చేశారు'
'ఇక మరోవైపు తీసుకుంటే.. పార్లమెంటులో పెప్పర్ స్ప్రేను ఆయుధంలా ఉపయోగించడం వల్ల ప్రజల్లో చాలా ప్రచారం కల్పించింది'
'ఇకపై చాలామంది దాన్నే ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందనుకోవడంలో నేనంతగా ఆశ్చర్యపడటం లేదు. భవిష్యత్తులో పెప్పర్ స్ప్రేను తరగతి గదుల్లో, థియేటర్స్, షాపింగ్ మాల్స్, కోర్టుల్లో, ఇతర చోట్ల ఉపయోగించే సంఘటనలు చూడబోతున్నాం' అని వర్మ ట్వీట్ చేశాడు.