: అమెరికన్లు మరీ ఇంత వెర్రివెంగళప్పలా?
అమెరికన్ల శాస్త్రీయ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చూడండి. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుందన్న విషయం ప్రతి నలుగురు అమెరికన్లలో ఒకరి తెలియదట. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఈ దారుణమైన విషయం వెల్లడైంది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ 2200 మంది పౌరులపై సర్వే నిర్వహించింది. భౌతిక, జీవ శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగారట. 74 శాతం మంది మాత్రమే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న విషయం తెలుసని చెప్పారు. మిగిలిన వారంతా నోళ్ళు వెళ్ళబెట్టారట. ఇక 48 శాతం మంది మనిషి కోతి నుంచి పరిణామం చెందాడన్న విషయం తెలుసన్నారు. కాగా, రెండేళ్ళకోమారు నిర్వహించే ఈ సర్వే ఫలితాలను ఓ నివేదిక రూపంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అందించనున్నారు.