: సడక్ బంద్ సబబే : నారాయణ
టీ జేఏసీ, టీఆర్ఎస్ జరుపుతోన్న సడక్ బంద్ సబబేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడం వల్లే సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్ధవడ్లపూడిలో ప్రారంభమైన సీపీఐ శిక్షణా తరగతుల కార్యక్రమానికి హాజరైన సందర్భంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.