: మధ్యాహ్న భోజనం తిని.. ఆసుపత్రి పాలైన 20 మంది విద్యార్థులు


మధ్యాహ్న భోజనం తిని.. అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. వారాంతంలో ఇంటికెళ్లి ఆడుకునే సమయానికి.. అనారోగ్యానికి లోనై ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల పరిధిలోని ఇరుకుపాలెం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో.. ఇవాళ మధ్యాహ్నం ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు అన్నంతో పాటు.. పప్పు, సాంబారు వడ్డించారు. సరిగ్గా ఉడకని అన్నం పెట్టడంతో.. ఆ విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన స్కూల్ టీచర్లు వారిని వెంటనే సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సత్తెనపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

  • Loading...

More Telugu News