: 17న జరిగేది ర్యాలీ మాత్రమే.. ఢిల్లీపై దాడి కాదు: అశోక్ బాబు
ఈనెల 17న ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో తలపెట్టిన సభకు అన్ని జాతీయ పార్టీలను ఆహ్వానిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అంతేకాకుండా కిరణ్, చంద్రబాబు, జగన్ లతో పాటు ఎంఐఎం, సీపీఎంను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. జాతీయ మీడియా కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న దారుణాలను జాతీయ పార్టీలు ఖండించాలని కోరారు. కొన్ని వేల మందితో చేపట్టిన ర్యాలీని... ఢిల్లీపై చేస్తున్న దాడిగా తెలంగాణ వారు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దాడి చేయాలనే ఉద్దేశమే ఉంటే ఎల్బీ స్టేడియంలో సభ జరిగినప్పుడే చేసుండేవాళ్లమని స్పష్టం చేశారు. హైదరాబాదులో ఎలా తిరుగుతారో చూస్తామంటున్నారని... హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని... ఈ నెల 22 తర్వాత హైదరాబాదులో ఎవరు ఎలా తిరుగుతారో చూస్తారని చెప్పారు.