: సెలెక్టర్లపై ఇషాంత్ గరం గరం


భారత సెలక్టర్ల వైఖరి మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకుముందోసారి మొహిందర్ అమర్ నాథ్ సెలక్టర్లను జోకర్లు అని అభివర్ణించగా, తాజాగా.. ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ కు జట్టు ఎంపిక సందర్భంగా అది నిజమే అనిపించక మానదు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మకు సెలక్టర్లు రెండు జట్లలోనూ చోటు నిరాకరించడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఇషాంత్ మాట్లాడుతూ, తాను కెరీర్ తొలినాళ్ళలో ఎలా బౌలింగ్ చేశానో, ఇప్పుడూ అలాగే బౌలింగ్ చేస్తున్నానని తెలిపాడు. అయినా, సెలక్టర్లు తనపై నమ్మకం ఉంచడం లేదని, కీలక పర్యటనలకు తనను పక్కన పెడతారని, సాదాసీదా పర్యటనలకు మాత్రం ఎంపిక చేస్తారని విమర్శించాడు. కివీస్ తో తొలి టెస్టులోనూ నిప్పులు చెరిగిన ఇషాంత్, రెండో టెస్టు తొలి రోజున 6 వికెట్లతో కివీస్ వెన్నువిరిచిన సంగతి తెలిసిందే. తానిప్పుడు మంచి ఫామ్ లో ఉన్నా ఎంపిక చేయకపోవడం దారుణమన్నాడు.

  • Loading...

More Telugu News