: వంటగ్యాస్ తో ఆధార్ అనుసంధానం తొలగింపుపై త్వరలోనే జీవో జారీ: పనబాక లక్ష్మి


గుంటూరు జిల్లా పరుచూరులో కమ్యూనిటీ కార్యాలయాన్ని ఈరోజు (శనివారం) కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం ప్రారంభించారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పనబాక స్పష్టం చేశారు. హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలనే యోచన ఉన్నట్లు ఆమె చెప్పారు. వంటగ్యాస్ తో ఆధార్ అనుసంధానాన్ని తొలగించేందుకు త్వరలోనే జీవో జారీ చేస్తామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News