: ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్ ను తిరస్కరించిన ఇరోం షర్మిల
మణిపూర్ లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఇరోం షర్మిల ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఏఏపీ నేత ప్రశాంత్ భూషణ్ తనను కలిసి పార్టీ తరపున మణిపూర్ లో పోటీ చేయమని అడిగారని, అందుకు తాను అంగీకరించలేదని షర్మిల మీడియాతో చెప్పారు. రాజకీయాల్లో చేరడానికి అంగీకరిస్తే సామాన్య ప్రజల మాటలను విస్మరించాల్సి వస్తుందనే ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని ఆమె వివరణ ఇచ్చారు.