: వచ్చే ఏడాదికల్లా.. మెట్రో రైలు వచ్చేస్తోంది
హైదరాబాదు మహా నగరానికి మెట్రో రైలు వస్తోన్న విషయం విదితమే. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు జంట నగరాల్లో చురుగ్గా సాగుతున్నాయి. మెట్రో తొలి దశలో నాగోల్-మెట్టుగూడ మార్గాన్ని వచ్చే ఏడాది ఉగాది పండుగకు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశలో మియాపూర్-సంజీవరెడ్డి నగర్ (ఎస్.ఆర్.నగర్) మార్గాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మియాపూర్-ఎస్.ఆర్.నగర్ మార్గంలో రైల్వే వంతెన పక్కన భరత్ నగర్ కాలనీ పరిధిలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులను ఎండీ ఈరోజు (శనివారం) పరిశీలించారు. స్థానికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాటిని సమర్థంగా ఎదుర్కొని ఈ మార్గాన్ని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.