: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం
రాజస్థాన్ లోని జోథ్ పూర్-జైసల్మేర్ రహదారి నెత్తురోడింది. గతరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. జోథ్ పూర్ సమీపంలోని ఖరీబేరి గ్రామం వద్ద ఈ ఘోరం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 17 మంది కలావు గ్రామం నుంచి జోథ్ పూర్ తిరిగి వెళుతుండగా, వీరి వాహనాన్ని మరో వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో పది మంది ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.