: సూర్యనెల్లి అత్యాచారం కేసులో 31మందికి బెయిల్


కేరళలోని సూర్యనెల్లిలో 1996లో జరిగిన అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న 31 మందికి కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. కేరళను విడిచి వెళ్లరాదని, అవసరమైనప్పుడు కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలనే షరతు విధించింది. ఇందుకుగాను  ఇద్దరు పూచీకత్తుతోపాటు, రూ.50,000 బాండ్లు సమర్పించాలని తెలిపింది. అంతేకాదు, ఈ కేసులో బాధితురాలు ఎలాంటి సందర్భాల్లోనూ వేధింపులకు గురి కాకూడదని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి వాదనలు ఏప్రిల్ 2కి వాయిదా వేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది.  

  • Loading...

More Telugu News