: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మియాందాద్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైరెక్టర్ పదవికి మాజీ టెస్టు కెప్టెన్ జావెద్ మియాందాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీబీ కొత్త చీఫ్ గా ఎన్నికయిన నజ్మా సేథికి పంపారు. 2008 నుంచి పీసీబీ డైరెక్టర్ జనరల్ గా మియాందాద్ బోర్డుకు తన సేవలందించారు. నాలుగు రోజుల కిందట పాక్ ప్రభుత్వం పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్ ను తొలగించటం, గవర్నింగ్ బాడీని రద్దు చేయడం జరిగింది. అనంతరం క్రికెట్ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రోజుల కిందట తొలిసారి సమావేశమైన కమిటీ... బోర్డుకు అధిపతిగా నజ్మా సేథిని ఎన్నుకొంది. దాంతో, మియాందాద్ వైదొలగాల్సి వచ్చింది.