: రెండో టెస్టులో పట్టుబిగించిన భారత్
న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసి 246 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించిన భారత్... రెండో ఇన్నింగ్స్ లో కూడా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది. ఓపెనర్ ఫుల్టన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి జహీర్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రూథర్ ఫర్డ్ (18), విలియంసన్ (4) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.