: జేపీని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు


లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్ లను హైదరాబాదులోని చందానగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్, లోక్ సత్తా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చందానగర్ లో అసంఘటిత కార్మికులతో జేపీ, కటారి సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News